Interest subsidy on tax arrears । తెలంగాణలో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి బంపరాఫర్
ఆస్తి పన్ను బకాయిలపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. నిర్దిష్ట తేదీలోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీపై భారీ రాయితీని ప్రకటించింది.
Interest subsidy on tax arrears । తెలంగాణ ఆస్తి పన్ను బకాయిదారులకు వడ్డీలో రాయితీ ఇవ్వాలని మునిసిపల్ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణ మునిసిపల్ శాఖ అధికారికంగా మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇవ్వనున్నది. ఇప్పటికే జీహెచ్ఎంసి పరిధిలో ఆస్తిపన్ను బకాయిల్లో వడ్డీపై రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల నుంచి వినతులు రావడంతో రాష్ట్రమంతటికీ వర్తింప చేయాలని నిర్ణయించింది. భారీ ఎత్తున బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రజలకు ఆకర్షణీయమైన రాయితీలు ఇచ్చింది. ఈ బంపర్ ఆఫర్‌తో పెద్ద ఎత్తున బకాయిలు వసూలు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ లోగా పాత బకాయిలు చెల్లిస్తే, వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు. పేరుకుపోయిన బకాయిల గుట్టను తగ్గించుకోవడంతో పాటు ఆదాయం రాబట్టుకోనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram