Viral: పెద్ద పులితో ఫోజు.. కొద్దిలో సచ్చి బతికిండు! జీవితంలో మళ్లీ ఫొటో కూడా దిగడు

Tiger | Thailand | Viral
విధాత: వన్యప్రాణులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయన్నది ఊహించలేని అంశం. మనుషులకు మచ్చికైన వన్యప్రాణులు కూడా అప్పుడప్పుడు తిరబడటం చూస్తుంటాం. అలాంటి ఘటనే థాయిలాండ్ లో చోటుచేసుకుంది. ట్రైనర్ వద్ధ పెరుగుతున్న క్రూరమృగం పెద్దపులితో సెల్ఫీలు, రీల్స్ చేసేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం తిరగబడింది.
మనుషులకు మచ్చికైన పెద్దపులితో ప్రమాదమేది ఉండదనుకొన్న ఆ వ్యక్తి రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. పెద్దపులిని పట్టుకుని దాంతో రీల్స్ షూట్ చేస్తున్న క్రమంలో అది ఆ వ్యక్తిపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. పులి దాడితో ఆ వ్యక్తి కేకలు, పెడబొబ్బలు పెడుతూ రక్షించాలంటే చావు కేకలు పెట్టాడు. పులి దాడిని ఊహించని ట్రైనర్ సైతం ఖంగుతిన్నాడు.
#viralvideo pic.twitter.com/EhUVYYzVnh
— srk (@srk9484) May 30, 2025
పులి దాడి నుంచి ఆ వ్యక్తిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అతి కష్టం మీద ఆ పులి నుంచి అతడిని కాపాడాడు. బతుకు జీవుడా అనుకుంటూ బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రికి పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన వారెవరూ కూడా ఇకమీదట క్రూరమృగాలతో చెలగాటమాడే పని చేయడానికి సాహసించరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.