Hyderabad | మెడికల్ డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి!

  • By: sr    news    Apr 21, 2025 5:50 PM IST
Hyderabad | మెడికల్ డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి!

విధాత: మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ సేవించే క్రమంలో అధిక డోస్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ లో చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి అబ్దుల్ నసర్ మరో ఇద్దరు విద్యార్థులు ఒకేసారి మత్తు ఇంజెక్షన్ తో పాటు టాబ్లెట్లు తీసుకున్నారు. వారిలో నసర్ మరణించగా..మిగతా ఇద్దరు యువకుల ఆరోగ్య పరిస్థితి కూడా విషమం ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముగ్గురికి మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్ అనే యువకుడికి అరెస్టు చేసి విచారిస్తున్నారు. మత్తు కోసం యువత ఇటీవలి కాలంలో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ప్రమాదకరమైన మత్త టాబ్లెట్లు, ఇంజక్షన్లు వాడుతూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.