Abhibus: తొమ్మిదో సంవత్సరంలోకి.. అభి బస్, మహేష్ బాబు బంధం

  • By: sr    news    Jun 19, 2025 10:03 AM IST
Abhibus: తొమ్మిదో సంవత్సరంలోకి.. అభి బస్, మహేష్ బాబు బంధం

హైదరాబాద్: ఇండియా బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రముఖ సంస్థ అభిబస్ (ixigo బస్ బిజినెస్). భారతీయ సినీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన అభిబస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు. 2016 నుండి మహేష్ బాబు అభిబస్ ప్రచార ముఖచిత్రంగా ఉన్నారు. విశ్వసనీయత, అనుబంధం, సులభ బస్ ప్రయాణ అనుభవం కోట్లాది మంది వినియోగదారులకు అందించారు.

ఈ శాశ్వత సహకారం ఇండియన్ మొబిలిటీ రంగంలో అత్యంత సుదీర్ఘ బ్రాండ్-సెలబ్రిటీ భాగస్వామ్యాలలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా అభిబస్, మహేష్ బాబు కలిసి గుర్తుండిపోయే ప్రచారాలు రూపొందించారు. హాస్యభరిత ప్రయాణ ప్రకటనల నుండి ఇంటికి తిరిగి రావడం, అనుబంధం తెలిపే భావోద్వేగ కథనాలు ప్రసారం చేశారు. ఈ పునరుద్ధరించిన భాగస్వామ్యం బలమైన కథన పునాదిపై ముందుకు సాగుతుంది. సరికొత్త ప్రచారం ఈ వేసవిలో మొదలవుతుంది.

ఎవరేమన్నారంటే..

ఈ విషయంపై అభిబస్ COO రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “మహేష్ బాబు కేవలం బ్రాండ్ అంబాసిడర్ కాదు – మా వృద్ధి ప్రయాణంలో సహ-ప్రయాణికుడు. 2016 నుండి 2025 వరకు, ఆయన ఉనికి దక్షిణాదిలోని, ఇతర ప్రాంతాలలోని ప్రేక్షకులతో లోతైన సంబంధాలు పెంచడానికి మాకు తోడ్పడింది. ఈ భాగస్వామ్యం మా వినియోగదారులు అభిబస్‌పై, మహేష్‌పై ఉంచిన నమ్మకానికి నిదర్శనం” అని ఆయన అన్నారు. భాగస్వామ్యం విస్తరించడంపై మహేష్ బాబు తన అభిప్రాయం పంచుకున్నారు.

“అభిబస్‌తో నా ప్రయాణం ఎప్పుడూ వ్యక్తిగతంగా అనిపించింది. నాకు గమ్యం చేరడం మాత్రమే కాదు – ప్రయాణం సురక్షితంగా, నమ్మకమైనదిగా, సులభతరం చేయాలి. అభిఅష్యూర్డ్ ద్వారా లభించే మనశ్శాంతి అయినా, ఫిల్టర్ న్యూ బస్సెస్ ఫీచర్ ద్వారా సరికొత్త బస్సులు ఎంచుకునే సౌకర్యం అయినా – ప్రతి వివరాలు ప్రయాణికుడిని దృష్టిలో ఉంచుకొని రూపొందాయి. అభిబస్ కేవలం మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చదు – మీరు సౌకర్యంగా అక్కడికి చేరుకునేలా చూస్తుంది. అందుకే ఈ అనుబంధం నాకు నిజంగా ప్రత్యేకమైనది” అని అన్నారు.