Sakshi Agarwal: జెట్ స్పీడులో.. బిగ్‌బాస్ బ్యూటీ
కోలీవుడ్ యువనటి సాక్షి అగర్వాల్ సినిమాలు, వాణిజ్య ప్రకటనల్లో బిజీగా కొనసాగుతూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘కాలా’, ‘సిండ్రెల్లా’, ‘భగీరా’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన సాక్షి, బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా బిజీగా వ్యవహరిస్తున్నారు.

కోలీవుడ్ యువనటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) వరుస అవకాశాలతో దూసుకెళుతుంది. ఇటు సినిమాలు, అటు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ముందుకుసాగుతోంది.
2019లో ‘బిగ్‌బాస్ సీజన్-3’లో పాల్గొని పాపులారిటీని దక్కించుకున్న సాక్షి అగర్వాల్ కేవలం నటి మాత్రమే కాకుండా మంచి మోడల్ కూడా. అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సాక్షి అగర్వాల్. 2013లో ‘రాజారాణి’, 2018లో ‘కాలా’, 2021లో ‘సిండ్రెల్లా’, 2023లో ‘భగీరా’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.
‘కాలా’ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తెగా నటించగా, ఓ తమిళ టీవీలో ప్రసారమయ్యే ‘నాంగ రెఢీ నీంగ రెఢీయా’ రెండో సీజన్‌కు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్‌ను వివాహం చేసుకున్న సాక్షి అగర్వాల్ ప్రస్తుతం కామరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆంత్రాలజీ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్లతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.