పెళ్లిపీటలెక్కనున్న ‘రంగం’ హీరోయిన్ కార్తీక..! రహస్యంగా నిశ్చితార్థం వేడుక..!

విధాత: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ వారసురాలిగా సినిమాల్లోకి వచ్చింది కార్తీక. అక్కినేని నాగచైతన్య నటించిన ‘జోష్’ సినిమాతో అరంగ్రేటం చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రేక్షలను ఆకట్టుకోలేకపోయింది. అయితే, కార్తీక తన నటనతో ప్రశంసలు అందుకున్నది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లోనూ నటించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో మెరిసింది. తమిళంలో చేసిన ‘రంగం’ సినిమా మాత్రం ఆకట్టుకున్నది. ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు మాత్రం అందుకులేకపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్‌లో రాణిస్తున్నది.
అయితే, తాజాగా కార్తీక త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నది. ఈ క్రమంలో కార్తీక తన ఇన్‌స్టాగ్రామ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నది. దీన్ని బట్టి చేస్తూ త్వరలోనే కార్తీక పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అర్థమవుతున్నది. ఓ వ్యక్తిని హాగ్ చేసుకుంటూ.. రింగ్‌ను ధరించిన ఫొటోను షేర్ చేసింది. దీన్ని గమనిస్తే ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, పెళ్లిపై అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. అలాగే, కార్తీక తన పోస్ట్‌లో కాబోయే భర్త గురించి ఏమీ చెప్పలేదు. కేవలం ఆ ఫొటోలో కేవలం ఉంగరాన్ని హైలెట్ చేస్తూ కనిపించగా.. నెగిటివ్ ఎనర్జీ పడకూడదనే ఈగల్ ఐ ఎమోజీని షేర్ చేసింది. దాంతో కార్తీక నిశ్చితార్థం చేసుకుందని నెటిజన్లు పేర్కొంన్నారు.
ఇదిలా ఉండగా.. కార్తీక ప్రేమ, పెళ్లిపై ఇటీవల కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్‌స్టాపోస్ట్ చూసిన వారంతా రూమర్స్ నిజమేనని భావిస్తున్నారు. అయితే, కార్తీక పెళ్లిపై త్వరలోనే కుటుంబీకులు ప్రకటన చేయనున్నారని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. కార్తీక చివరిసారిగా అలాగే తెలుగులో అల్లరి నరేశ్ నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’లో కనిపించింది. కార్తీక సోదరి తులసి సైతం పలు సినిమాల్లో నటించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘కడల్’ సినిమాల్లో నటించింది.