Aditya 369: ప్రసాద్ ఐమాక్స్ ముందు.. టైం మెషిన్!

విధాత: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన టాలీవుడ్ బిగ్గెస్టు హిట్ సినిమాల్లో ఒకటైన `ఆదిత్య 369` సినిమా” మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి చేస్తుంది. శుక్రవారం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా థియేటర్ల వద్ధ బాలయ్య బాబు అభిమానుల హంగామా అధికమైంది. టైం ట్రావెల్ కాన్సెప్టుతో శ్రీకృష్ణ దేవరాయుల కాలానికి వెళ్లి రావడం కథాంశంగా నిర్మితమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఆదిత్య 369 పట్ల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథలో టైం మెషిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1991 ఆగస్టు 18న థియేటర్లలో రిలీజయింది. టైం మెషీన్ కథాంశంతో ప్రస్తుత కాలానికి భవిష్యత్ వర్తమానాలను లింక్ చేస్తూ తీసిన ఈ చిత్రం.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇండియాలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య 369లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించగా..ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
దాదాపు 34 ఏళ్ల క్రితం సినీ అభిమానులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. ఈ జనరేషన్ ఆడియన్స్ ను అలరించడానికి మరోసారి థియేటర్లలోకి వచ్చింది. అధునాతన సాంకేతిక సొగసులు అద్దుకుని ఈరోజు (ఏప్రిల్ 4) 4K వెర్షన్ లో రీ-రిలీజ్ అయింది. అదిత్య 369 సినిమా రీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టైం మెషిన్ నమూనాను థియేటర్ల ముందు ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ప్రత్యేకంగా చేపించిన ఆదిత్య 369 టైం మెషిన్ ప్రజల సందర్శన కోసం పెట్టారు.
ఈ నమూనా టైమ్ మెషిన్ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లలతై దాని వద్ధకు వెళ్లి లోనికి ఎక్కి మరి ఎంజాయ్ చేస్తున్నారు. రీరిలీజ్ లోనూ ప్రేక్షాకాదరణ పొందుతున్న ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 తీస్తామని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించి సినిమాపై మరింత హైప్ పెంచేశారు.