Airtel: ఒక్క ప్లాన్.. 189 దేశాలకు కనెక్టవిటీ

  • By: sr    news    Apr 25, 2025 7:44 PM IST
Airtel: ఒక్క ప్లాన్.. 189 దేశాలకు కనెక్టవిటీ

విధాత : ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ భారతీయులకు అంతర్జాతీయ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్ లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్ టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏ దేశానికి వెళ్లినా ప్రత్యేకంగా జోన్లు లేదా ప్యాక్ లు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్లాన్ తోనే 189 దేశాల్లో కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతం ఏ ఇతర నెట్ వర్క్ లోనూ ఇలాంటి ప్లాన్ లేకపోవడంతో ఎయిర్ టెల్ ప్లాన్ వినియోగదారులను ఆకర్షించేదిగా కనిపిస్తుంది.

విదేశాల్లో ఉన్న భారతీయుల (ఎన్ ఆర్ ఐ) కోసం ఎయిర్ టెల్ ప్రత్యేకంగా రూ.4000తో ఏడాది కాల వ్యవధితో ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 5జీబీ డేటా, 100 ఇంటర్నేషనల్ వాయిస్ నిమిషాలు లభిస్తాయి. ఇదే ప్లాన్ ను భారత్ లో వాడితే రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ముఖ్యంగా విమాన ప్రయాణాల సమయంలో కూడా ఈ ప్లాన్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. విదేశీ గడ్డపై దిగిన వెంటనే సేవలు ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతాయి. విదేశాల్లో లోకల్ సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వినియోగాన్ని ట్రాక్ చేయడం, బిల్లింగ్ చెక్ చేయడం, అదనపు డేటా/నిమిషాలు జోడించడం కోసం ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ లో చూసుకోవచ్చు.

ఈ ప్లాన్ వినియోగదారులు తమ భారతీయ నంబర్ ను ఉంచుకుని విదేశాల్లో నిరంతరంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే, అన్ లిమిటెడ్ డేటా పై ఫెయిర్ యూజేస్ పాలసీ వర్తిస్తుంది. ఇది ఒక స్థాయికి మించి వాడిన డేటాపై వేయబడే పరిమితి లాంటిది. విదేశాలకు తరచుగా ప్రయాణిస్తే లేదా కుటుంబ సభ్యులు బయట ఉన్నా, ఎయిర్ టెల్ కొత్త ఇంటర్నేషనల్ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుందని ఎయిర్ టెల్ చెబుతుంది.