Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున బర్త్ డే కు స్పెషల్ వీడియో ట్రీట్

అక్కినేని నాగార్జున బర్త్‌డే స్పెషల్: అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి విడుదలైన వీడియో వైరల్. శివ 4K రీ రిలీజ్ తో అభిమానులకు డబుల్ ట్రీట్.

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున బర్త్ డే కు స్పెషల్ వీడియో ట్రీట్

Akkineni Nagarjuna | విధాత : టాలీవుడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) పుట్టిన రోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) నుంచి ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ఓ స్పెషల్ మ్యాష్‌అప్‌ వీడియోను విడుదల చేశారు. వీడియోలో నాగార్జున నటించిన సినిమాల్లోని సన్నివేశాలు..ఆయన పాత్రాలలోని ప్రముఖ డైలాగ్ లను హైప్ చేస్తూ చూపించారు. ఈ ఫీల్డ్‌లో కొత్తగా ట్రై చేయాలంటే నేనే’ అంటూ నాగార్జున డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆగస్టు 29వ తేదీన 67వ వసంతంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి చిత్రం విక్రం. ఈ సినిమా 1986 మే 23న విడుదల అయింది. ఆ తర్వాతా ఇండస్ట్రీ మైలురాయి వంటి గీతాంజలి, శివ(Shiva) చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. హాలో బ్రదర్(Hello Brother), నిన్నే పెళ్లాడుతా(Ninne Pelladata), మన్మధుడు(Manmadhudu), సంతోషం(Santosham), సోగ్గాడే చిన్ని నాయన(Soggade Chinni Nayana), అన్నమయ్య(Annamayya), శ్రీరామదాసు(Sri ramadasu), ఓం నమో వెంకటేశాయ(Om Namo Venkatesaya), వంటి చిత్రాలతో అలరించారు. తన సీని కేరియర్ లో 1990 – శివ సినిమాలో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాతా 1997లో అన్నమయ్య సినిమాలో నటనకు, 2002లో సంతోషం సినిమాలో, 2006లో శ్రీరామదాసులో నటనకు నంది ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

66 ఏళ్ల వయసులోనూ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకపోతున్న నాగార్జున బిగ్ బాస్ షో(Big Boss) ద్వారా మరింత పాపులారిటీ సాధించారు. నటుడిగా, నిర్మాత, హోస్టు, బిజినెస్ మ్యాన్ గా పలు విభిన్న రంగాల్లో నాగ్ సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. నాగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుండి ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున “డబుల్ హౌస్ – డబుల్ డోస్” అంటూ చెప్పిన డైలాగ్ బిగ్ బాస్ 9సీజన్ పై అంచనాలు పెంచింది. ఇటీవల కుబేరా, కూలీ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నాగార్జున జోరు మీదున్నారు. ప్రస్తుతం తన 100వ సినిమా కోసం కథా చర్చల్లో నిమగ్నమయ్యారు. నాగార్జున బర్త్ డే కానుకగా ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సినిమా ‘శివ’ 4కేలో రీ రిలీజ్ కానుంది.