Steve Smith: వన్డేలకు అసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గుడ్ బై!

విధాత, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ వన్డేల(International One-Day)కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్(Australia’s Star Batter) స్టీవ్ స్మిత్ (Steve Smith’s)రిటైర్‌మెంట్(Retirement) ప్రకటించారు. స్టీవ్ స్మీత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కెప్టెన్‌గా వ్యవహరించారు . ఈ టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేల నుంచి రిటైరవుతున్నట్లుగా స్టీవ్ స్మిత్ ప్రకటించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని స్మిత్ పేర్కొన్నాడు.
తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్లో భారత్‌పై ఓటమి తర్వాత స్మిత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, 2010లో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్మిత్ 15ఏళ్లు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో 169 వన్డే మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 43 సగటుతో 5727 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015, 2023 వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో స్మిత్ సభ్యుడుగా ఉండటం విశేషం.