Warangal: ఆటో ట్రాలీ, లారీ ఢీ.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం!

  • By: sr |    news |    Published on : Mar 21, 2025 5:27 PM IST
Warangal: ఆటో ట్రాలీ, లారీ ఢీ.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం!

11 మందికి తీవ్రగాయాలు

విధాత, వరంగల్: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 17మంది మహిళ కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొన్నది. ఈ టనలో13 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా మరో 8 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వివరించారు.

ఘ‌టనలో గాయపడిన వారిని హుటాహుటిన మూడు అంబులెన్స్ లలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒక మహిళ మృతి చెందగా మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.