Bigg Boss 7 Telugu | ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఏడో సీజన్ త్వరలోనే ప్రారంభంకానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు ప్రసారమయ్యాయి. తాజాగా ఏడో సీజన్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తొలి సీజన్ మహారాష్ట్రలో నిర్వహించగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తొలి సీజన్ హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. రెండో సీజన్ నుంచి హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రెండో సీజన్‌కు న్యాచరుల్ స్టార్ నాని హోస్ట్ వ్యవహరించాడు.. అయితే, […]

Bigg Boss 7 Telugu |
ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఏడో సీజన్ త్వరలోనే ప్రారంభంకానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు ప్రసారమయ్యాయి. తాజాగా ఏడో సీజన్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తొలి సీజన్ మహారాష్ట్రలో నిర్వహించగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
తొలి సీజన్ హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. రెండో సీజన్ నుంచి హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రెండో సీజన్‌కు న్యాచరుల్ స్టార్ నాని హోస్ట్ వ్యవహరించాడు.. అయితే, ఎన్టీఆర్ రేంచ్‌లో మెప్పించకపోయినా తనదైన శైలిలో షోను నడిపించారు. సెకండ్ సీజన్‌లో నానిపై విమర్శలు రావడంతో తప్పుకున్నాడు.
మూడో సీజన్‌నుంచి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. మూడు సీజన్లలోనూ బిగ్‌బాస్ షో అభిమానులను పెద్దగా అలరించకపోయింది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. తాజాగా ఏడో సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కొత్త సీజన్‌ను సరికొత్తగా ప్లాన్ చేయడంతో పాటు డిజైన్ చేస్తున్నట్లు టాక్. అయితే, బిగ్‌బాస్ షోను లీకులు వెంటాడుతున్నాయి.
షోకు వెళ్లే వారి నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు? కెప్టెన్ ఎవరయ్యారు? ఎలాంటి టాస్క్‌లు పెట్టబోతున్నారు? అనే వివరాలు ముందస్తుగానే బయటకు వస్తున్నాయి. దాంతో షోపై ఎవరికి ఎలాంటి ఆసక్తి లేకపోతోంది.
తొలి సీజన్ లోనావాలలో నిర్వహించగా.. అక్కడ పని చేసేవారిలో ఎవరూ తెలుగు వారు లేకపోవడంతో లీకులు బయటకు రాలేదు. సెకండ్ సీజన్ నుంచి హైదరాబాద్‌లోనే నడుస్తుండడంతో ఇక్కడ పని చేసే వారంతా లోకల్ వ్యక్తులు కావడంతో లీకులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో లీకులపై జాగ్రత్తగా తీసుకుంటున్నారని సమాచారం.
షోకు సంబందించిన కీలక అప్‌డేట్స్ ముందే బయటకు రావడంతో వ్యూవర్ షిప్‌పై ప్రభావం కనిపిస్తుంది. అలాగే నాల్గో సీజన్ నుంచి షోను రాత్రి 10 గంటలకు ప్రసారం చేయడం సైతం మైనస్‌గా మారింది. గత సీజన్‌లో తీసుకువచ్చిన టాస్క్‌లు ఏమాత్రం అభిమానులను అలరించలేకపోయాయి.
ఈ సారి సీజన్‌లో టాస్క్‌లతో పాటు కాస్త ఘాటుగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో ముక్కూ మొహం తెలియని చాలా మందిని కంటెస్టెంట్స్‌గా తీసుకువచ్చారు. దాంతో ఎవరికీ ఆసక్తిగా కనిపించలేదు. అందుకే ఈ సారి సీజన్‌లో కాస్త ప్రముఖంగా ఉన్న, కాంట్రవర్షల్ క్యాండిడేట్స్‌ను ఈ షోలో తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది.
