MP Raghunandan Rao : బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేదు
బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేదని కవితను రఘునందన్ రావు ప్రశ్నించారు. హరీశ్ రావు దుబ్బాకకు అన్యాయం చేశారని ఆరోపించారు. సంతోష్ ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
దుబ్బాకకు హరీశశ్ రావు అన్యాయం చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎంపీగా గెలవలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Pochampally Srinivas Reddy), నవీన్ రావు(Navee rao)పై ఏసీబీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో ఉన్న సమయంలో ఈ ఎమ్మెల్సీల గురించి కవిత(Kavitha) ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. నగర శివార్లలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల విషయం కూడా చెబితే బాగుండేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy), హరీశ్ రావు(Harish Rao) ఒకే విమానంలో ప్రయాణించారని తాను గతంలోనే చెప్పానని ఆయన అన్నారు. కవిత చెప్పిన విషయాల్లో కొత్తదనం ఏమీలేదన్నారు. గతంలో తాను బీఆర్ఎస్(BRS) లో ఉన్న సమయంలో దుబ్బాకలో ఓడిపోవడానికి కారణం ఏంటో కేసీఆర్(KCR) కు చెప్పానని ఆయన గుర్తు చేశారు. గతంలో నార్సింగి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన ఓ అధికారి అనేక అరాచకాలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలు మీడియా సమావేశంలో కవిత చెబితే బాగుండేదన్నారు. అతడి ద్వారానే సంతోష్ సెటిల్ మెంట్లు చేశారని ఆయన అన్నారు. సంతోష్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు రెండేళ్లుగా కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram