Dasoju Sravan: బండి సంజయ్.. సిగ్గు, లజ్జ లేకుండా మాట్లాడుతున్నడు

  • By: sr    news    Mar 24, 2025 8:43 PM IST
Dasoju Sravan: బండి సంజయ్.. సిగ్గు, లజ్జ లేకుండా మాట్లాడుతున్నడు

విధాత : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులకు బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని.. ఎన్నికల్లో పంచినవన్ని అక్కడ ముద్రించిన దొంగనోట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర రచ్చ రేపుతున్నాయి. గతంలో సిద్దిపేట ఎస్పీగా ఉన్న అధికారి నాకు ఇటీవల ఆ విషయం చెప్పారని.. ఆ అధికారి దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్ ను సీజ్ చేద్దామని వెళితే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి ఆపారని చెప్పారంటూ సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బండి సంజయ్ మాటలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

దీంతో బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో తన వ్యాఖ్యలకు మద్దతుగా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా వీ.హనుమంతరావు అప్పటి రవాణ శాఖ మంత్రి కేసీఆర్ కు దొంగనోట్ల కేసు నిందితుడు రామకృష్ణగౌడ్ తో సంబంధం ఉందని.. ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చేసిన డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాతో కూడిన ఓ వార్త పత్రిక కటింగ్ ను పోస్టు చేశారు. గతంలో కేసీఆర్ ను పాస్ పోర్టు బ్రోకర్, దొంగనోట్ల వ్యక్తి అని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆయనతో ఉన్న లోపాయికారి అవగాహనతో ఆ విషయాలన్ని తొక్కిపెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై బీఆర్ ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏకంగా బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కేంద్రమంత్రి స్థాయిలో లేవని.. సిగ్గు, లజ్జ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టపర చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు 

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. BRSV మతిస్థిమితం తప్పి కేసీఆర్ గారి పైన అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నా బండి సంజయ్ ఆరోపణలు కాదు దమ్ముంటే నిరూపించమని హెచ్చరించిన బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ..
గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే, ప్రస్తుతం ఉన్నది మీ ప్రభుత్వమే కనుక మీరే రాయండి నిజ నిజాలు ఏందో ఎంక్వయిరీ చేసి తెలంగాణ ప్రజలకు తేల్చి చెప్పాలి లేదా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముక్కు నేలకు రాసి కేసిఆర్ గారికి క్షమాపణలు చెప్పాలన్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ ని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేసి పార్టీ నుండి తొలగించాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని డిమాండ్ చేస్తున్నామ‌ని, పార్లమెంట్ సెక్రటేరియట్ కార్యాలయం వెంట‌నే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా స్పీకర్ కార్యాలయాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్, రాష్ట్ర కార్యదర్శి జంగయ్య. కాటం శివ కొంపల్లి నరేష్. శీను నాయక్. కోదాటి నాగేంద్రరావు. బల్లెం అవినాష్. సాయి గౌడ్. సంజు. దినేష్. తదితరులు పాల్గొన్నారు.