ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచేలా బడ్జెట్
మోడీకీ సంకల్పపత్రలో ప్రభుత్వ విద్యకు గ్యారంటీ లేదని TPTF అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ అన్నారు. శనివారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులు 1,28,650 కోట్లు మాత్రమేనని, ఇది మొత్తం బడ్జెట్ లో 2.53 శాతం మాత్రమే అన్నారు. ఇది గత సంవత్సరం కన్నా 0.03 శాతం తక్కువ అని, కేంద్రం ఏటా విద్యకు కేటాయింపులు తగ్గిస్తోందన్నారు.
గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గిస్తూ విద్యలో ప్రైవేటు సంస్థల ప్రాధాన్యత పెంచేలా చేస్తున్నారని, దీంతో బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందదని స్పష్టం చేశారు. స్వతంత్ర అమృత ఉత్సవాల సందర్భంగా, 75 సంవత్సరాల వికసిత భారత రిపబ్లిక్ బడ్జెట్లో కనీసం 6 శాతం కేటాయిస్తేనే విద్యాసంస్థలకు మౌలిక వసతులు కల్పించగలమని అన్నారు. పాఠశాలల్లో 10 లక్షల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయలేమని కూడా అన్నారు. మరో సారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే ఈ బడ్జెట్ అని కుండబద్దలు కొట్టారు..
ముత్యాల రవీందర్ , రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ,TPTF
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram