Viral News | ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోయిన ఉద్యోగిని..!

సాధారణంగా తక్కువ జీతం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? బాస్ దగ్గరకు వెళ్లి జీతం పెంచమని అడుగుతారు.. ఒప్పుకోకపోతే నిరసన తెలుపుతారు.. లేదంటే మంచి శాలరీతో వేరే జాబ్ చూసుకుని వెళ్లిపోతారు. కానీ చైనాకు చెందిన ఓ యువతి చేసిన పని మాత్రం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

Viral News | సాధారణంగా తక్కువ జీతం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? బాస్ దగ్గరకు వెళ్లి జీతం పెంచమని అడుగుతారు.. ఒప్పుకోకపోతే నిరసన తెలుపుతారు.. లేదంటే మంచి శాలరీతో వేరే జాబ్ చూసుకుని వెళ్లిపోతారు. కానీ చైనాకు చెందిన ఓ యువతి చేసిన పని మాత్రం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం ప్రకారం.. చైనాలోని షాంగ్క్యూ నగరానికి చెందిన ఓ మహిళ తనకు వస్తున్న జీతంతో తీవ్ర అసంతృప్తి చెందింది. తాను చేస్తున్న పనికి తగినంత జీతం ఇవ్వడం లేదని భావించిన ఆమె.. ఆఫీసు సమయంలోనే ఐదు గంటల పాటు నిద్రపోయి నిరసన తెలిపింది. ఇలా రోజూ చేస్తుండటం గమనించిన బాస్.. ఆమెను గట్టిగా మందలించాడు. మళ్లీ ఇలాంటి సీన్ రిపీట్ అయితే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఏడుస్తూ జరిగిన విషయం మొత్తాన్ని సోషల్‌మీడియాలో పంచుకుంది.

నేను ఉద్యోగం వదిలివెళ్లను.. ఎంతకానీ జీతం ఇస్తే అంతే పనిచేస్తాననే విషయాన్ని బాస్‌కు అర్థమయ్యేలా చెస్తానని సోషల్‌మీడియాలో సదరు యువతి తెలిపింది. అంతేకాకుండా తాను పడుకున్నందుకు బాస్ ఎందుకు అంత సీరియస్ అయ్యాడో కూడా సవివరంగా తెలిపింది. సదరు యువతి పడుకున్న యువతి నిద్రలేవగానే ఆకలిగా అనిపించింది. దీంతో బాస్ టేబుల్‌పై కనిపించిన చాక్లెట్ తీసుకుని తీసేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..

వాళ్ల బాస్‌ గ్లూకోస్ లోపంతో బాధపడుతున్నాడు. గ్లూకోజ్ సడెన్‌గా తగ్గినప్పుడు ఒక చాక్లెట్ తిని బ్యాలెన్స్ చేసుకుంటుంటాడు. అందుకే టేబుల్ దగ్గర ఎప్పుడూ ఒక చాక్లెట్ ఉంచుకుంటాడు. కానీ సదరు యువతి అదే చాక్లెట్‌ను తినేసింది. తీరా బాస్‌కు గ్లూకోజ్ తగ్గి చాక్లెట్ తిందామని చూస్తే దొరకలేదు. తీరా చాక్లెట్ దొరక్కపోవడంతో నీరసించి కిందపడిపోయాడు. తేరుకున్న తర్వాత అసలు విషయం తెలియడంతో ఆమెపై బాస్ ఇంకా సీరియస్ అయ్యాడు. అందుకే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నానరు. కొంతమంది తక్కువ జీతం ఉండటంపై సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ.. చాలామంది ఆమె ప్రవర్తనను తప్పుబట్టారు. జీతం తక్కువైనా పని బాధ్యతలను విస్మరించడం సరైంది కాదని సూచించారు. ఏ కంపెనీలో కూడా ఇలాంటి ప్రవర్తనను అంగీకరించరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More:

మేకప్ కిట్‌నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు

కట్నంగా కారు ఇవ్వలేదని వరుడు పరార్.. పొలాల్లో పరుగులు!

Latest News