చిరంజీవి ఇంట విషాదం

<p>చిరంజీవి ఇంట విషాదం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన దత్తత తీసుకున్న ‘జూ’లోని గజరాణి కన్నుమూసింది. విధాత:నెహ్రూ జూపార్కులోని 83 ఏళ్ల ఆడ ఏనుగు గజరాణి వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందింది. నిజాం కాలం నాటి ఏసియాటిక్‌ జాతికి చెందిన రాణి ఏనుగు జూలో గజరాణిగా ప్రసిద్ధి చెందింది. నగరంలోని సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేగింపులో చాలా ఏళ్లు ఇది పాల్గొంది. 1938 జులై 7న […]</p>

చిరంజీవి ఇంట విషాదం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన దత్తత తీసుకున్న ‘జూ’లోని గజరాణి కన్నుమూసింది.

విధాత:నెహ్రూ జూపార్కులోని 83 ఏళ్ల ఆడ ఏనుగు గజరాణి వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందింది. నిజాం కాలం నాటి ఏసియాటిక్‌ జాతికి చెందిన రాణి ఏనుగు జూలో గజరాణిగా ప్రసిద్ధి చెందింది. నగరంలోని సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేగింపులో చాలా ఏళ్లు ఇది పాల్గొంది. 1938 జులై 7న జన్మించిన రాణి ఏనుగు తొలుత నిజాం పాలకులు నిర్వహించిన నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని బాగే ఆమ్‌ జంతు ప్రదర్శనశాలలో ఉంది. 1963 అక్టోబరు 1న దీన్ని నెహ్రూ జూలోకి తరలించారు.

ఏనుగులు సాధారణంగా 60 ఏళ్లపాటు జీవిస్తాయని, రాణి ఏనుగు 83 ఏళ్లు జీవించడం విశేషమని జూ అధికారులు తెలిపారు. ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డులోని ఏసియాటిక్‌ ఆడ ఏనుగు చెంగళూరు దాక్షాయణి, లీన్‌వంగ్‌లోని మగ ఏనుగు 86 ఏళ్లు జీవించాయి. 83 ఏళ్లు జీవించిన రాణికి ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించిన ఏనుగుల్లో మూడో స్థానం లభించింది. ఈ ఏనుగును గతేడాది జులై 20న రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన దత్తత తీసుకున్నారు. రాణి మృతి చెందడంతో ప్రస్తుతం ఆడ ఏనుగులు వనజ, ఆశ, సీతలతో పాటు మగ ఏనుగు విజయ్‌ ఉన్నట్లు జూ క్యూరేటరు వీవీఎల్‌ సుభద్రాదేవి తెలిపారు.

Latest News