సీఎం రేవంత్‍కు తప్పిన ప్రమాదం!

  • By: sr    news    Apr 15, 2025 6:08 PM IST
సీఎం రేవంత్‍కు తప్పిన ప్రమాదం!

విధాత: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. నోవాటెల్ హోటల్ లో సీఎల్పీ సమావేశానికి హాజరైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి లిఫ్టు ఎక్కారు. సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప సాంకేతిక సమస్యల కారణంగా లిఫ్టు అదుపు తప్పింది. లిఫ్టులో ఎక్కిన వారి ఓవర్ వెయిట్‍తో ఆగాల్సిన లెవల్ కంటే దిగువకు లిఫ్టు ఆగింది.

దీంతో కొద్దిసేపు అంతా కంగారు పడ్టారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. లిఫ్టు నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా అందరిని బయటకు వచ్చేలా చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అంతా లిఫ్టు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎందరో ప్రముఖులు విడిది చేసే నోవాటెల్ హోటల్ లిఫ్టులో సాంకేతిక సమస్యలు.. ప్రమాదం తలెత్తడం విస్మయ పరిచింది.