Kannappa | కన్నప్ప.. రిలీజ్ డేట్ ప్రక‌టించిన‌ యూపీ సీఎం యోగి

  • By: sr    news    Apr 09, 2025 5:40 PM IST
Kannappa | కన్నప్ప.. రిలీజ్ డేట్ ప్రక‌టించిన‌ యూపీ సీఎం యోగి

విధాత: మంచు ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం క‌న్న‌ప్ప విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బుధ‌వారం క‌న్న‌ప్ప టీం మంచు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, నటుడు ప్రభుదేవాలు కలిశారు. యోగి చేతుల మీదుగా కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ మూవీని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం యోగి చేతుల మీదుగా కన్నప్ప రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయాన్ని మంచు మనోజ్ ఎక్స్ లో పోస్టు చేశారు. నేను ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లో ఒకరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను ఈరోజు కలిశాను. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను ఆయన చేతుల మీదగా విడుదల చేయడం ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు. యోగికి ధన్యవాదాలు తెలిపారు. రమేశ్ గొరిజాల గీసిన అద్భుతమైన కళాఖండాన్ని ఆయనకు కానుకగా అందించామని విష్ణు తెలిపారు. జూన్ 27న ‘కన్నప్ప’ విడుదల కానుంది” అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ మోహన్ బాబు సైతం పోస్ట్ పెట్టారు. ‘మీ ఆతిథ్యానికి, ఆప్యాయతకు ధన్యవాదాలు సర్’ అని రాసుకొచ్చారు. ఈ భేటీలో ప్రభుదేవా సైతం పాల్గొన్నారుసీఎం యోగికి ధన్యవాదాలు తెలిపారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘కన్నప్ప’ సిద్ధమవుతోంది. ఏవీఏ ఎంటర్ టైన్మెంట్ 24 ప్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా.. ప్ర‌భాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తార‌లు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 25న దీనిని విడుదల చేయాలని తొలుత టీమ్ భావించింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో జూన్ 27కు వాయిదాపడింది.