Sequels | ముగింపు దశకు చేరుకున్న 2025… సీక్వెల్ సినిమాల పరాజయాలపై పెద్ద చర్చ!

Sequels | 2025 సంవ‌త్స‌రం చివరి రోజులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఈవ్‌కి యూత్ ఇప్పటికే వేడుకల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో, ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన బాలీవుడ్ సీక్వెల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణించాయి అనే విశ్లేషణ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  • By: sn |    movies |    Published on : Dec 09, 2025 3:40 PM IST
Sequels | ముగింపు దశకు చేరుకున్న 2025… సీక్వెల్ సినిమాల పరాజయాలపై పెద్ద చర్చ!

Sequels | 2025 సంవ‌త్స‌రం చివరి రోజులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఈవ్‌కి యూత్ ఇప్పటికే వేడుకల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో, ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన బాలీవుడ్ సీక్వెల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణించాయి అనే విశ్లేషణ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాదిలో అగ్రహీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, టైగర్ శ్రాఫ్ లాంటి స్టార్‌లు చేసిన అనేక సీక్వెల్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యపరిచింది.

అక్షయ్ కుమార్ సీరిస్ – వరుస నిరాశలు

➤ కేసరి చాప్టర్ 2

2019 బ్లాక్‌బస్టర్ “కేసరి”కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్ (₹150 కోట్లు)తో రూపొందినా, కేవలం ₹145 కోట్లు మాత్రమే రాబట్టింది.

➤ హౌస్‌ఫుల్ 5

హిట్ ఫ్రాంచైజీని కొనసాగించినప్పటికీ, 240 కోట్ల బడ్జెట్‌కు సరిపడా పాజిటివ్ వర్డ్-ఆఫ్-మౌత్ రాలేదు. మొత్తం వసూళ్లు ₹249 కోట్లు మాత్రమే.

➤ జాలీ ఎల్ఎల్బీ 3

అక్షయ్–అర్షద్ వార్సీ కాంబినేషన్ ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయి బజ్ కనిపించలేదు.
బడ్జెట్: ₹120 కోట్లు
కలెక్షన్స్: ₹166.06 కోట్లు
హిట్ కాదు, ఫ్లాప్ కూడా కాదు…

వార్ 2 – భారీ అంచనాలు… భారీ నష్టం

➤ హృతిక్ రోషన్ – Jr NTR కాంబినేషన్‌లో ‘వార్ 2’

అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ యాక్షన్ బిగ్గీ 2025లో అత్యంత ఎదురుచూసిన సీక్వెల్. అయినా…

బడ్జెట్: ₹450 కోట్లు
కలెక్షన్స్: ₹351 కోట్లు

2019 “వార్” చిత్రానికి ఇది సరైన సీక్వెల్ కాదు.

అజయ్ దేవగన్ – వరుస డిజాస్టర్లు

➤ సన్ ఆఫ్ సర్దార్ 2

2012 హిట్టుకు సీక్వెల్‌గా వచ్చినా, ఇది బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డిజాస్టర్.
బడ్జెట్: ₹150 కోట్లు
కలెక్షన్స్: ₹61 కోట్లు

➤ దే దే ప్యార్ దే 2

అజయ్–రకుల్ ప్రీత్ కాంబినేషన్ మళ్లీ పనిచేయలేదు.
బడ్జెట్: ₹150 కోట్లు
కలెక్షన్స్: ₹98.85 కోట్లు

టైగర్ శ్రాఫ్ – బాఘి 4 కూడా పరాజయం

➤ బాఘి 4

ఈ సారి ఫ్రాంచైజీ మ్యాజిక్ పనిచేయలేదు.
బడ్జెట్: ₹80 కోట్లు
కలెక్షన్స్: ₹67 కోట్లు

ఇతర సీక్వెల్ చిత్రాలు కూడా ఫెయిల్యూర్

➤ మెట్రో ఇన్ డినో (సీక్వెల్ to Life in a Metro)

బడ్జెట్: ₹47 కోట్లు
కలెక్షన్స్: ₹69 కోట్లు
కలెక్షన్స్ బాగానే ఉన్నా, స్కేల్‌కు తగ్గ రన్ ఇవ్వలేకపోయింది.

➤ ధడక్ 2

సిద్ధాంత్ చతుర్వేది – త్రిప్తి దిమ్రీ కాంబో ఉన్నప్పటికీ, పూర్తి ఫ్లాప్.
బడ్జెట్: ₹60 కోట్లు
కలెక్షన్స్: ₹29 కోట్లు

2025 సారాంశం .. సీక్వెల్ మ్యాజిక్ పూర్తిగా పనిచేయలేదు

ఈ ఏడాది బాలీవుడ్‌లో క్లియర్‌గా కనబడిన ట్రెండ్ ఏంటంటే పేరుకు సీక్వెల్ అంటే సరిపోదు… కంటెంట్ బలంగా లేకపోతే ప్రేక్షకులు క్షమించరు . స్టార్ పవర్, భారీ బడ్జెట్, బిగ్ ఫ్రాంచైజీలు ఉన్నా… కథ వర్కౌట్ కాకపోతే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాల‌ ఉదాహరణలు ఈ ఏడాది వందల కోట్ల రూపాయల నష్టంలో స్పష్టంగా కనిపించాయి. కాబట్టి, 2026లో రాబోయే సీక్వెల్ చిత్రాలకు ఇది పెద్ద హెచ్చరికగా మారింది.