Akshay Kumar| అక్షయ్ ది గ్రేట్..650మంది స్టంట్ మెన్ లకు ఇన్సూరెన్స్

అక్షయ్ ది గ్రేట్…650మంది స్టంట్ మెన్ లకు ఇన్సూరెన్స్
విధాత : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన మానవత వాదాన్ని..సహాయ గుణాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇటీవల తమిళ ఇండస్ట్రీలో ‘వేట్టువం’ సినిమా షూటింగ్ లో స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందిన ఘటన వార్తతో కలత చెందిన హీరో అక్షయ్ కుమార్ భవిష్యత్తులో ఈ రకమైన ప్రమాదాల సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత నందించాలని భావించాడు. ఆ వెంటను అక్షయ్ కుమార్ స్వయంగా 650 మంది స్టంట్ మాస్టర్లు, స్టంట్ మెన్ లకు తన సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ పాలసీ చేయించి తన గొప్ప మనసు చాటుకున్నాడు. అక్షయ్ కుమార్ చేసిన సహాయంపై చలన చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్‌లో, బయట ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకు బీమా పొందవచ్చు.
అక్షయ్ కుమార్ సహాయంపై బాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ విక్రమ్‌సింగ్ స్పందించారు. మీరు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్‌మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల హీరో ఆర్య ప్రధాన పాత్రలో దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్న ‘వేట్టువం’ షూటింగ్‌లో స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందారు. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు ప్రమాదానికి గురై మరణించాడు. ఈ ఘటన సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన సెట్ లలో ప్రమాదాల నివారణ చర్యలపై అంతా ఫోకస్ పెట్టేలా చేసింది.