కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మె.. తీవ్రమవుతున్న ఆందోళన

విధాత వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన ఉదృతమవుతోంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు , ఆందోళనలు చేపడుతున్నారు. గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలలో ఉన్నత విద్యాభివృద్ధి కృషిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర చాలా కీలకమైనది. ఏళ్ల తరబడి యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కేయులో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరింది. దీంతో పాఠ్యాంశాలు బోధించేవారు లేక విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు.
నిరసన దీక్షకు పలువురి మద్దతు
నాలుగు రోజులుగా సమ్మె చేస్తూ యూనివర్సిటీలో నిరసన దీక్ష చేపడుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల పోరాటానికి వివిధ విద్యార్థి సంఘాలతో పాటు అధ్యాపక సంఘాలు కూడా మద్దతునందిస్తున్నాయి. మంగళవారం మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతును అందించారు. వారి న్యాయమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తన హామీని నిలబెట్టుకోవాల్సిందేనని అన్నారు. ఉన్నత విద్య, అనేక సంవత్సరాలుగా విద్యార్హత గల గలిగిన కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేకపోవడం మూలంగా కాంట్రాక్టు వ్యవస్థలోనే మిగిలిపోయారని తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మాజీ అకుట్ జనరల్ సెక్రటరీ ప్రో.మామిడాల ఇస్తారి మాట్లాడుతూ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రెగ్యులరైజ్ చేస్తానని ప్రకటించినందున యూనివర్సిటీ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విషయం అడుగుతున్నారు తప్ప కొత్తది ఏమీ అడగట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో డా . పీ కరుణాకర్ రావు, డా. సంకినేని వెంకన్న, డా. సతీష్, డా. శ్రీధర్ కుమార్ లొద్,డా. సాదు రాజేష్, డా. జూల సత్య, డా. నిరంజన్, డా. చంద్రశేఖర్, డా. రఘు వర్ధన్ రెడ్డి, డా. ఆరూరి సూర్యం, డా. సూర్యనారాయణ,డా. ఫిరోజ్, డా. నాగయ్య, డా. శ్రీనువాష్,డా. వెంకటేశ్వర్లు, సిద్ధార్థ, డా. వీణ,డా. శ్రీదేవి, డా. వినీత, డా. శ్రీలత,డా. కవిత, డా. స్వప్న, డా. రేఖ, డా. వీణ,డా. వాణిశ్రీ, డా. పరినఫాతిమా, డా. బ్లేస్సి ప్రియాంక, డా. సుజాత, డా. సునీత , డా. గడ్డం కృష్ణ, డా. బ్రహ్మం, డా. ప్రసాద్, డా. భాగ్య, డా.సుకన్య, డా. మధుకర్,డా. రాజు తదితరులు పాల్గొన్నారు.