Horoscope: గురువారం (09.01.2025) ఈరోజు మీ రాశి ఫలాలు! వారు నూతన కార్యాలకు దూరంగా ఉండాలి

Horoscope |
జ్యోతిషం అంటే మనవారికి జన్మజన్మల నుంచి చెరగని నమ్మకం. మనకు లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటా. అందుకే రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే పడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది సెర్చ్ చేసేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు. పరిస్థితులు అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత. ఆర్థిక ఇబ్బందులు, రుణప్రయత్నాలు. ఆలస్యంగా బంధు, మిత్రుల సహాయ సహకారాలు.
వృషభం
అన్నికార్యాల్లో విజయం, అంతటా సౌఖ్యం పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు. గౌరవ, మర్యాదలు అధికం. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందుతారు. కుటుంబంలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభం.
మిథునం
పట్టుదలతో కార్యాలు పూర్తి. పిల్లలపట్ల జాగ్రత్తగా అవసరం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. మనోల్లాసం, స్వల్ప అనారోగ్య బాధలు.
కర్కాటకం
మనస్సు చంచలం. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు. ఆకస్మిక కలహాలకు అవకాశం. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.
సింహం
తలచిన కార్యాలకు ఆటంకాలు. స్థిరాస్తుల సమస్యల్లో జాగ్రత్త మంచిది. మోసపోయే అవకాశాలు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం. నూతన కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువ.
కన్య
విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా. ప్రయాణాలు ఎక్కువ. మెలకువ అవసరం. స్థానచలనం. రుణ లాభం. ఎలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు.
తుల
అనారోగ్యాలతో సతమతమతం. స్థానచలనం. నూతన వ్యక్తుల పరిచయం. కుటుంబ పరిస్థితులతో మానసిక ఆందోళన. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం.
వృశ్చికం
ఆలస్యంగా ఆత్మీయుల సహకారం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. ప్రయాణాల్లో జాగ్రత్త మంచిది. అజీర్ణబాధలు అధికం. కీళ్లనొప్పులు. మనో విచారం.
ధనుస్సు
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. అనారోగ్యంతో బాధలు. కుటుంబ విషయాల్లో అసంతృప్తి. వృధా ప్రయాణాలు. ధనవ్యయం.
మకరం
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహఙంచాలి. వ్యవహారాలు, చేసే పనుల్లో ఇబ్బందులు.
కుంభం
ధర్మకార్యాలకు ఆసక్తి. దైవదర్శనం. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. శుభవార్తలు వింటారు. సులభంగా శుభకార్య ప్రయత్నాలు.
మీనం
అనవసర భయాందోళనలు తొలుగుతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలనం. ఆర్థిక స్థితిలో మార్పులు. రుణప్రయత్నాలు చేస్తారు. ఆలస్యంగా ఆత్మీయుల సహకారం