Karnataka: భార్య, కూతురు కలిసి.. కారం చల్లి, కాళ్లు, చేతులు కట్టేసి! కర్ణాటక మాజీ డీజీపీ హత్యలో సంచలన విషయాలు

  • By: sr    news    Apr 21, 2025 3:53 PM IST
Karnataka: భార్య, కూతురు కలిసి.. కారం చల్లి, కాళ్లు, చేతులు కట్టేసి! కర్ణాటక మాజీ డీజీపీ హత్యలో సంచలన విషయాలు

Karnataka: విధాత: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లో ఉంటున్న మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఓం ప్రకాష్ ను తామే హత్య చేసినట్టు భార్య పల్లవి, కుమార్తె కృతి విచారణలో ఒప్పుకున్నట్లుగా దర్యాప్తు వర్గాల కథనం.

భార్య, కూతురు కలిసి ఓంప్రకాశ్ పై కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి చంపారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగానే మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను హత్య చేసినట్లుగా భార్య, కుమార్తెలు వెల్లడించారు. గతంలో ఓం ప్రకాష్ తన భార్య పల్లవి, కూతురు కృతిలను చంపేస్తానంటూ ఇద్దరికీ తుపాకీ చూపించి బెదిరించాడు. ఈ నేపథ్యంలో తమను చంపేస్తాడన్న భయంతో ముందే అతన్ని హత్య చేసినట్లుగా భార్య, కుమార్తెలు తెలిపారు.