Viral: అచ్చం మనిషిలా.. పెదాలు, పళ్లు ఉన్న చేపను ఎప్పుడైనా చూశారా!

విధాత: ప్రకృతిలో చేపల జాతులు ఎన్ని ఉన్నా.. మనుషులను పోలిన చేపలున్నాయన్న సంగతి మాత్రం పెద్ద వింతనే. సముద్రాలలో ఉంటారని చెప్పుకునే మత్స్య కన్యల కథలు ఎన్ని విన్నా ఇప్పటిదాకా వాటిని చూసినోళ్లు ఎవరూ లేరు. అయితే మనిషి ముఖాన్ని పోలినట్లుగా ఉండే చేపలను చూస్తే మాత్రం మనం షాక్ అవ్వాల్సిందే.
ట్రిగ్గర్ ఫిష్ గా పిలవబడే చేపలు మనిషి ముఖంలోని పెదవులు, దంతాలను పోలిన నిర్మాణాలతో అచ్చం మనిషిలా చూపరులను భయపెడుతుంటాయి. ట్రిగ్గర్ ఫిష్ తల పెద్దదిగా..ఆకారం చిన్నదిగా ఉంటుంది. బలమైన దవడ..పెదవులు.. నోటిలో దంతాలు..నోటి నుంచి చాల వెనుకకు తల పై భాగంతో చిన్న కళ్లు ఉంటాయి.
A fish with human-like lips and teeth known ad trigger fish #viralvideo pic.twitter.com/Edz1pLt8qv
— srk (@srk9484) June 3, 2025
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల జలాల్లో 40 కంటే ఎక్కువ జాతుల ట్రిగ్గర్ ఫిష్‌లు కనిపిస్తాయి. మనిషిలాంటి పెదవులు, దంతాలు కలిగిన చేపను ట్రిగ్గర్ ఫిష్ అని పిలుస్తారు. ఎక్కువగా సముద్రాల్లోని నాచు, నత్తలు, చిరు చేపలు, జీవులను తినే ట్రిగ్గర ఫిష్ లు పగడపు దీవుల ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయట. పునరుత్పత్తి కాలంలో తమ గూడులను కాపాడుకునేందుకు తీవ్రమైన దాడులు చేస్తుంటాయని నిపుణుల సమాచారం.
A fish with human-like lips and teeth known ad trigger fish #viralvideo pic.twitter.com/Edz1pLt8qv
— srk (@srk9484) June 3, 2025