Eagle: గ‌ద్ద‌.. స‌ముద్రంలో మునిగి చేపను ఎలా ప‌ట్టిందో చూడండి?

Eagle: గ‌ద్ద‌.. స‌ముద్రంలో మునిగి చేపను ఎలా ప‌ట్టిందో చూడండి?

విధాత: ఆకాశంలో విహరించే గరుడ పక్షులు (గద్దలు) నీటిలో మునిగి వేటాడవు. ఎందుకంటే వాటి రెక్కలు తడిస్తే ఎగరలేక ఆ నీటిలోనే పడి చనిపోయే ప్రమాదముంంటుంది. చేపలు సైతం నీటిలో ఉన్నప్పుడు పక్షులతో హానీ ఏందుకుంటుందనుకుంటూ హాయిగా అలల మాటున విహరిస్తుంటాయి. ఇలాగే వాటి జీవనం సాగితే అందులో ఏ ప్రత్యేకత ఉండదు మరి. అందుకు విరుద్దంగా సాగితే అదో సంచలనం. గగన విహారి గద్ద(ఈగల్), జలధి(సముద్రం)లోని చేపను నీట మునిగి మరి వేటాడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అలల మాటున విహరిస్తున్న చేపను ఆకాశం నుంచి గమనించిన గద్ద అదును చూసుకుని సర్రుమని అలల్లోకి వెళ్లి మరి వేటాడింది. చేపను పట్టుకునేందుకు అలల నీటిలో మునిగి చేపను తన కాలిగోర్లతో బంధించి రివ్వుమని మళ్లీ అకాశానికి ఎగిరిపోయింది. ఆ చేప బరువు ఇంచుమించు ఆ గద్ద బరువు ఉన్నప్పటికి అంత బరువున్న చేపను కాళ్లతో పట్టుకోని తడిసిన తన రెక్కలతో అతికష్టం మీద మళ్లీ ఆకాశయానం చేసిన ఆ గద్ద ఆహారం వేటలో తన నైపుణ్యంతో పాటు సాహసమే ప్రదర్శించింది.

ఎందుకంటే చేపను పట్టే క్రమంలో నీటి మునిగిన గద్ద రెక్కలు తడిసిపోవడంతో అది సరిగా ఎగరలేకపోతే ఆ సముద్రంలోనే పడి చనిపోయే ప్రమాదముంది. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి ఆహారం వేటలో గద్ద చూపిన తెగువ.. నైపుణ్యాన్ని చేసిన నెటిజన్లు ఔరా అని ముక్కున వేలేసుకుంటూ నెవర్ బిఫోర్ ఎవర్ అఫ్టర్ అంటూ గద్ద సాహసాన్ని అభినందిస్తున్నారు.