Eagle Bird| పులి పిల్లను ఎగరేసుకపోబోయి..పులినోట చిక్కిన గద్ద

Eagle Bird| పులి పిల్లను ఎగరేసుకపోబోయి..పులినోట చిక్కిన గద్ద

విధాత: ప్రకృతిలోని జీవరాశి తనకంటే బలమైన జంతువులకు ఆహారంగా మారడం సాధారణంగా చూస్తుంటాం. అందుకే చిన చేపను పెద్ద చేప..పెద్ద చేపను తిమింగలం మింగేస్తుందంటుంటాం. ఇది ప్రకృతిలో సహజ పరిణమంగానే కొనసాగుతుండగా..కొన్నికొన్ని సార్లు శక్తికి మించిన పని చేయబోయి కొన్ని ప్రాణులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. అలాంటిదే ఓ భారీ గద్ధ(గరుడ పక్షి)  దుస్సాహసం కథ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అడవిలో ఆకాశ మార్గంలో వెలుతున్న గద్ధకు కింద ఓ చిరుత పులి(చీతా) దాని, పిల్ల వెలుతుండటం కంటపడింది. ఇంకేముంది చిరుత పులి పిల్లను సునాయసంగానే ఎగరేసుకుపోవచ్చనుకుని..ఒక్కసారిగా దానిపై దాడికి దిగింది. ఆకాశం నుంచి వాయువేగంతో కిందకు వచ్చి చిరుత పిల్లను కాళ్లతో బంధించి గాలిలోకి ఎగరేసుకుపోయింది. గాలిలోకి ఎగిరే క్రమంలో తన కాళ్లలో బందీగా ఉన్న చిరుత పిల్ల కదలడంతో మరింత గట్టిగా పట్టుకునే క్రమంలో భూమిపైకి వాలిపోయింది.

అంతే.. తన పక్కనే ఉన్న తన బిడ్డను ఎగరేసుకుపోవాలని చూసిన గద్దపై ఒక్క ఉదుటున ఎగిరి దూకి దాని గొంతు పట్టుకుంది తల్లి చిరుత. దెబ్బకు ఆ భారీ గద్ద నేలపై తీవ్ర గాయాలతో చచ్చిపడింది. చిరుత పులి పిల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఆహారాన్ని వేటాడే క్రమంలో నేలపైకి దిగిన గద్ద రెప్పపాటులో చేసిన పొరపాటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో క్షణం ఆలస్యం చేయకుండా గద్దపై దాడి చేసి తన బిడ్డను రక్షించుకున్న తల్లి చిరుత సమయస్ఫూర్తిని అక్కడే ఉండి అదంతా తమ కెమెరాల్లో చిత్రీకరించిన సందర్శకులు అభినందించారు.