Health: వయస్సు పెరిగినా మెదడు చురుగ్గా ఉండాలా?.. అయితే ఇలా చేయండి

Health | Brain
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందనే అపోహను నమ్మేవారికి ఈ కథనం ఆసక్తి కలిగించదు. వయసు పెరిగేకొద్దీ మెదడు నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గుతుందనే తప్పుడు నమ్మకంతో చాలామంది జీవిస్తున్నారు. అయితే, వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. జ్ఞాపకశక్తి లోపాలు ఏ వయసులోనైనా సంభవించవచ్చు. సకాలంలో చర్యలు తీసుకోకపోతే వృద్ధాప్యం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. “వృద్ధుల్లో గణనీయమైన జ్ఞాపకశక్తి నష్టం వృద్ధాప్యంలో సాధారణ భాగం కాదు. మెదడు గాయం లేదా నాడీ సంబంధిత అనారోగ్యం కారణంగా వస్తుంది. అల్జీమర్స్ భయానకమైనది” అని హార్వర్డ్ కథనం చెబుతోంది.
మెదడు ఆరోగ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన అంశాలు, పర్యావరణ అంశాలు, జీవనశైలి కారకాలు. ఈ కారకాలు మెదడు అభిజ్ఞా ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మెదడు గ్రహణ, జ్ఞాన నిలుపుదల సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. దీని ఫలితంగా వ్యక్తులు డ్రైవింగ్, బిల్లులు చెల్లించడం, మందులు తీసుకోవడం, వంట చేయడం వంటి సాధారణ పనులు చేయడం మరిచిపోతారు. జన్యుపరమైన అంశాలను నియంత్రించలేము. ఇతర అంశాలు మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని నిరూపితమైంది.
వయసు పెరిగినా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు:
మానసికంగా చురుకుగా ఉండాలి.
మెదడుకు పోషణనిచ్చే ఆహారాలు తీసుకోండి.
వ్యాయామం తప్పనిసరి.
నాణ్యమైన నిద్ర పొందండి.
ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి.
సామాజికంగా కలసిమెలసి ఉండండి.
నేర్చుకుంటూ ఉండండి.
మెదడును రక్షించండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
మద్యం తగ్గించండి, ధూమపానం మానాలి.