Owaisi: పాకిస్తాన్‌కు రుణం ఇవ్వడం.. ఉగ్ర సంస్థకు ఇచ్చినట్లే

  • By: sr    news    May 10, 2025 7:35 PM IST
Owaisi: పాకిస్తాన్‌కు రుణం ఇవ్వడం.. ఉగ్ర సంస్థకు ఇచ్చినట్లే

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడాన్ని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. పాక్ కు రుణం ఇవ్వడమంటూ ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని ఒవైసీ విమర్శించారు. పాకిస్తాన్ నిబంధనల మేరకు ఆ రుణాన్నిపేదరిక నిర్మూలనకు, పోలియోపై పోరాటానికి, మహిళల సాధికారతకు ఉపయోగించదని.. కేవలం భారత్ కు వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచేందుకే వినియోగిస్తుందని విమర్శించారు.

పాకిస్తాన్ కు రుణం ఇవ్వడంపై పశ్చిమ దేశాలు మౌనంగా ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని.. ఉగ్రవాదానికి సమకూరుస్తున్న నిధులు అని తెలిసే అమెరికా, కెనడా, జర్మనీ దేశాలు మౌనంగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని దాని వల్ల కలిగే ప్రమాదాన్ని ప్రపంచం గుర్తించాలని సూచించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయించాలని.. లేకపోతే ఆ దేశం మానవాళికి ముప్పని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యనించారు.