Hyderabad: అమెరికా గంజాయితో.. పట్టుబడ్డ‌ మాజీ సీఎస్ కుమారుడు!

  • By: sr    news    Apr 16, 2025 6:11 PM IST
Hyderabad: అమెరికా గంజాయితో.. పట్టుబడ్డ‌ మాజీ సీఎస్ కుమారుడు!

విధాత: యూపీ మాజీ సీఎస్‌ కుమారుడు ప్రీతిష్ భట్ హైదరాబాద్ లో డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్‌లోగ్స్‌ సప్లయ్‌ చేస్తుండగా ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతని నుంచి రూ.40 లక్షల విలువైన ఓజీకుష్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రీతిష్ భట్ 500 గ్రాముల అమెరికన్ గంజాయిని హైదరాబాద్ కు తెచ్చి ప్రముఖులకు సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రీతిష్ భట్ తో పాటు అతని స్నేహితుడు జయసూర్యను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అమెరికా నుంచి బెంగళూరుకు షిప్ ద్వారా గంజాయి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కు ట్రైన్ లో గంజాయి తీసుకొస్తున్నట్లుగా సమాచారం. ఒక్కో గ్రామ్ అమెరికా గంజాయి రూ.5 వేలకు అమ్మకాలు సాగిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు శ్రమిస్తున్న పోలీసులకు తరుచు డ్రగ్స్, గంజాయి కేసులు ఎదురవుతుండటం సవాల్ గా మారింది.