Warangal: ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు.. ముఠా అరెస్టు

Warangal:
విధాత, వరంగల్: అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం వరంగల్ టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. మరోకరు ప్రస్తుతం జైలులో వున్నారు. నిందితుల నుండి పోలీసులు సుమారు 78లక్షల 63వేల రూపాయల విలువ గల గడువు తీరిన, నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల తయారీ మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు,ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు:1.ఇరుకుల్ల వేదప్రకాశ్ (53),మట్టెవాడ,వరంగల్. 2. మహ్మద్ సిద్దిక్ ఆలీ (46),లక్ష్మీ పురం, వరంగల్. 3. నూక రాజేష్ ఆలియాస్ రాజు (40),సుల్తాన్‌బాద్,పెద్దపల్లి జిల్లా. 4. యల్లం సదాశివుడు(57), కరీంనగర్. 5.యం.డి రఫీక్(50), గొవిందరావుపేట, ములుగు జిల్లా. 6. ఆళ్లచేరువు శేఖర్ (37),మడుగు,ప్రకాశం జిల్లా.ఆ.ప్ర. 7.పొదిళ్ళ సాంబయ్య (55), దుగ్గొండి,వరంగల్ జిల్లా. 8. విష్ణు వర్థన్ (ప్రస్తుతం పరారీలో వున్నాడు). 9.ముద్దగుల ఆదిత్య (32),హైదరాబాద్(ప్రస్తుతం జైలులో వున్నాడు).
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు,వ్యవసాధికారులు సంయుక్తంగా కలిసి మట్టెవాడ బోడ్రాయి ప్రాంతంలోని ప్రధాన నిందితుడు ఇరుకుళ్ళ వేదప్రకాశ్ ఇంటిపై దాడి చేసి మరో ముగ్గురు నిందితులు సిద్దిక్,రాజేష్,సదాశివుడులను పోలీసులు అదుపులోకి తీసుకోని ఇంటి నుండి పెద్ద మొత్తం నకిలీ మరియు గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకొన్నారు.
నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్, వరంగల్ ఏసిపిలు మధుసూదన్, నందిరామ్ నాయక్, ఇన్స్పెక్టర్లు ఎస్. రాజు, గోపి, ఎస్.ఐలు వంశీకృష్ణ, నవీన్, ఆర్.ఎస్.ఐ భాను ప్రకాశ్ , ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ సురేష్, సురేందర్, సాంబరాజు, శ్రీనివాస్, సతీష్ కుమర్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.