HYD: హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ !

విధాత : హైదరాబాద్ నగరంలో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపింది. ఎయిర్ పోర్టుకు వెళుతున్న జర్మనీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులో ఎక్కించుకున్న ముగ్గురు యువకులు మార్గమధ్యంలో పహాడీ షరీఫ్ వద్ధ నిర్మానుష్య ప్రాంతంలో యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. జర్మనీలో తనతో పాటు చదువుకున్న హైదరాబాద్ యువకుడి కోసం బాధితురాలు వారం క్రితం హైదరాబాద్ కు వచ్చింది. తిరిగి ఎయిర్ పోర్టుకు వెలుతున్న క్రమంలో మీర్ పేట్ సమీపంలోని మందమల్లమ్మ దగ్గర టాక్సీ కోసం ఎదురుచూస్తుంది.
కారులో వెలుతున్న ముగ్గురు యువకులు జర్మనీ యువతిని గమనించి ఎక్కడికి వెళ్లాలని అడిగి మేం కూడా ఎయిర్ పోర్టుకే వెలుతున్నామని చెప్పి లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో అమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తనపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.