Gold Rates | ఆల్ టైమ్ రికార్డులో.. బంగారం ధర

Gold Rates |
విధాత: బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. నిన్నటి ధరలతో పోల్చితే హెచ్చుదల లేకపోయిన స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరలు రూ.94,000లను తాకి బుధవారం కాస్తా దిగి వచ్చాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర హైదారాబాద్ సహా దేశంలోని ముఖ్య పట్టణాల్లో రూ.85,100, 24క్యారెట్ల బంగారం ధర రూ.92,840గా వద్ధ కొనసాగుతోంది.
ఢిల్లీలో రూ.85,250, రూ.92,990, చైన్నైలో రూ.85,100, రూ. 92,840గా ఉన్నాయి. బెంగళూరు లో రూ.85,100, రూ.92,840గా ఉంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.81,058, 24క్యారెట్లకు 87,526గా, అమెరికాలో 22క్యారెట్లకు రూ.81,330, 24క్యారెట్లకు రూ.86,466 వద్ధ కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగడంతో భారత్ లోనూ బంగారం ధరలు పెరుగుతు వెలుతున్నాయి.
దీంతో కొనుగోలు దారులు పసిడి కొనుగోలుపై వెనుకంజ వేస్తున్నారు. వివాహాది శుభాకార్యాలు ఉన్న వారు తప్ప మిగతా కొనుగోలు దారులు పెరిగిన ధరలతో కొనుగోలు వాయిదా వేస్తున్నారు. అయితే మునుముందు లక్ష మార్కును చేరవచ్చన్న అంచనాల నేపథ్యంలో మరికొందరు ఎప్పుడైనా తప్పదనుకుని పసిడి కొనుగోలు చేస్తున్నారు. వెండి ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో రూ.1,14,000గాఉంది.