వాహన మిత్ర స్కీమ్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
విధాత,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ వాహన మిత్ర స్కీమ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి చెందిన బీజేపీ నేత భానుప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ లబ్ది కోసమే దేవాదాయశాఖ నిధులను ఖర్చు చేశారని పిటిషనర్లు వాదనలు వినిపించారు. దేవాదాయశాఖ చెందిన 49 లక్షల రూపాయలను వాహన మిత్రకు మంజూరు చేయడం చట్టవిరుద్దమని […]

విధాత,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ వాహన మిత్ర స్కీమ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి చెందిన బీజేపీ నేత భానుప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ లబ్ది కోసమే దేవాదాయశాఖ నిధులను ఖర్చు చేశారని పిటిషనర్లు వాదనలు వినిపించారు.
దేవాదాయశాఖ చెందిన 49 లక్షల రూపాయలను వాహన మిత్రకు మంజూరు చేయడం చట్టవిరుద్దమని లాయర్ పేర్కొన్నారు. వాహన మిత్రకు దేవాదాయశాఖ నిధులు ఖర్చు చేయవద్దని జూలై 5 వరకు మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 5కి హైకోర్టు వాయిదా వేసింది.