Rasi Phalalu: జనవరి 24, శుక్రవారం ఈ రోజు మీ రాశిఫలాలు.. వారి చేతికి అనుకోకుండా డబ్బు

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నుంచి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
మేషం (Aries) :
అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి, శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు ఉంటాయి. అనుకోకుండా డబ్బు చేతికొస్తుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు.
వృషభం (Taurus) :
అన్నికార్యాల్లో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికం. మంచి శక్తి సామర్థ్యాలు పొందుతారు. కుటుంబంలో వృద్ధి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.
మిథునం (Gemini) :
పట్టుదలతో కార్యాలు పూర్తిచేస్తారు. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. మనోల్లాసం పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం (Cancer) :
ఆత్మీయుల సాయం దొరుకుతుంది. ఆకస్మిక ధననష్టం జరిగే అవకాశం. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు. అధికార భయం. ప్రయాణాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.బంధువుల రాకపోకలుంటాయి.
సింహం (Leo) :
అనుకున్న పనులకు ఆటంకాలు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. అయోమయంగా ఆర్థికపరిస్థితులు . కొత్త పనులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి.
కన్య (Virgo) :
వృత్తిరీత్యా అనుకూల చలనం. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో సతమతం. స్థిరాస్తుల విషయాల్లో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం
తుల (Libra) :
తలపెట్టిన కార్యక్రమాలకు ఇబ్బందులు. బంధు మిత్రులతో విరోధం. స్త్రీల వళ్ల శతృబాధలు. మనస్తాపం. పగ, ప్రతీకారాలు వదిలేయాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పిల్లల విష యంలో శుభవార్తలు వింటారు.
వృశ్చికం (Scorpio) :
విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధననష్టం. మానసిక ఆందోళన. కుటుంబంలో మార్పును ఆశిస్తారు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. బంధువుల రాకపోకలుంటాయి.
ధనుస్సు (Sagittarius) :
కొత్తవారితో పరిచయాలు. స్త్రీల వళ్ల లాభాలు. బంధు, మిత్రులు,సహచరులు గౌరవిస్తారు. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యత. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశముంది. ఆదాయం బాగా పెరుగుతుంది.
మకరం (Capricorn) :
ఆర్థిక సమస్యలు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టాలు. ఫ్యామిలీలో మార్పు కోరుకుంటారు. అవకాశాలు జారి పోతాయి. ఆకస్మిక ధననష్టం. వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.
కుంభం (Aquarius) :
ధర్మకార్యాలపై ఆసక్తి . దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం లభిస్తాయి. పేరు ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభం. సొంత పనులు, వ్యవ హారాల మీద ఎక్కువగా శ్రద్ధ అవసరం.
మీనం (Pisces) :
అనవస భయాందోళనలు పోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వహించాలి. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలనం. ఆర్థిక పరిస్థితిలో మార్పులు. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యం. ఇంటా బయటా ఒత్తిడి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి.