Python | వరంగల్ భద్రకాళి ఆలయంలో కొండచిలువ! (వీడియో)
Python | WARANGAL | Sri Bhadrakali Ammavari Devastanam
విధాత: వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో కొండ చిలువ కలకలం రేపింది. దేవాలయ ప్రాంగణంలో సంచరిస్తున్న కొండచిలువను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. భద్రకాళి చెరువు(భద్రకాళి బండ్) సమీపంలో భద్రకాళి ఆలయం ఉంది.
ఆలయ ప్రాంతంలో రాళ్లు, చిన్న పొదలు కూడా ఉండటం…బండ్ సుందరీకరణ పనులు జరుగుతుండటంతో అక్కడి నుంచి ఆలయ సమీపంలోకి కొండ చిలువ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే అమ్మవారి ఆలయానికి ప్రాకారాలు, మాఢ వీధులు నిర్మిస్తున్నారు. కాకతీయ శిల్పకళ వైభవం చాటేలా 127 అంతస్తులతో 9అంతస్తుల రాజగోపురం, 7అంతస్తులతో మరో మూడు గోపురాలు నిర్మిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram