Warangal: మటన్ వండలేదని.. భార్యను చంపిన భర్త
విధాత, వరంగల్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజా తండాలో దారుణం జరిగింది. మాంసం కూర (మటన్) వండలేదని భర్త బాలు తన భార్యను మంగళవారం రాత్రి అతి కిరాతకంగా కొట్టి చంపాడు. భార్య మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవరూ లేని సమయంలో గొడవ పడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. మాంసం కూర వండ లేదని భర్త కొట్టి చంపాడని పేర్కొంది. ఆమె ఆరోపణ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram