HYDRAA | వ‌ర్షాల వేళ‌.. హైదరాబాద్‌లో క‌మిష‌న‌ర్ల క్షేత్ర స్థాయి పర్యటన

`మోంథా` తీవ్ర తుఫానుతో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో ల‌క్డికాపూల్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను హైడ్రా, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్, ఆర్ వీ క‌ర్ణ‌న్ లు ప‌రిశీలించారు. మాస‌బ్ ట్యాంకు నుంచి ల‌క్డికాపూల్ వైపు వ‌స్తున్న‌ప్పుడు మెహ‌దీ ఫంక్ష‌న్ హాల్ వద్ద వ‌ర్ష‌పు నీరు రోడ్డు మీద నిల‌వ‌డానికి కార‌ణాల‌ను కమిషనర్లు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

  • By: Subbu |    news |    Published on : Oct 29, 2025 6:13 PM IST
HYDRAA | వ‌ర్షాల వేళ‌.. హైదరాబాద్‌లో క‌మిష‌న‌ర్ల క్షేత్ర స్థాయి పర్యటన

విధాత, హైదరాబాద్ :

`మోంథా` తీవ్ర తుఫానుతో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో ల‌క్డికాపూల్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను హైడ్రా, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్, ఆర్ వీ క‌ర్ణ‌న్ లు ప‌రిశీలించారు. మాస‌బ్ ట్యాంకు నుంచి ల‌క్డికాపూల్ వైపు వ‌స్తున్న‌ప్పుడు మెహ‌దీ ఫంక్ష‌న్ హాల్ వద్ద వ‌ర్ష‌పు నీరు రోడ్డు మీద నిల‌వ‌డానికి కార‌ణాల‌ను కమిషనర్లు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక్క‌డ వ‌ర్ష‌పు నీరు నిల‌వ‌డంతో తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని.. వెంట‌నే ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించాల‌ని ఇరువురు క‌మిష‌న‌ర్లు అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే ఇక్క‌డ ఇరువైపులా రోడ్డును త‌వ్వి రెండు ఫీట్ల విస్తీర్ణంతో ఉన్న పైపులైన్ల‌ను వేశామ‌ని.. వాటికి మ‌హ‌వీర్ ఆసుప‌త్రి ప‌రిస‌రాలతో పాటు చింత‌ల‌బ‌స్తీ ప్రాంతాల నుంచి వ‌చ్చిన మురుగు, వ‌ర‌ద నీటిని అనుసంధానం చేయాల్సినవ‌స‌రం ఉంద‌న్నారు.

త్వ‌రిత‌గ‌తిన ఈ ప‌నులు కూడా పూర్తి చేయాల‌ని సూచించారు. ఈలోగా మ‌హావీర్ ఆసుప‌త్రి ముందు నుంచి మెహిదీ ఫంక్ష‌న్ హాల్ వ‌ర‌కు రోడ్డుకు ప‌క్క‌గా ఉన్న పైపులైన్ల‌లో పేరుకుపోయిన మ‌ట్టిని తొల‌గిస్తే.. స‌మ‌స్య చాలా వ‌ర‌కు ప‌రిష్కారం అవుతుంద‌ని క‌మిష‌న‌ర్లు సూచించారు. ఒక‌టి రెండు రోజుల్లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా స‌హ‌క‌రించి పైపులైన్ల అనుసంధాన ప‌నులు త్వ‌ర‌గా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ల‌క్డికాపూల్ ప‌రిస‌రాల‌ను సంద‌ర్శించిన వారిలో హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌, ట్రాఫిక్ డీసీపీ శ్రీ‌నివాస్ ఉన్నారు.