Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో ఐసిస్ టెర్రరిస్టుల అరెస్ట్

ముంబై ఎయిర్ పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దల్ ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, తల్హా ఖాన్ ను అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ కోర్టులో హాజరు పరచనున్నారు. వీరిద్దరూ ఇండోనేషియాలోని జకార్తా నుంచి ముంబైకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో ఐసిస్ టెర్రరిస్టుల అరెస్ట్

Mumbai Airport: ముంబై: పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో భద్రత్త కట్టుదిట్టం చేసింది. ఇక జమ్ముకశ్మీర్ ను జల్లెడ పట్టేసిస్తున్నది. ఉగ్రవాదుల కదలికలు ఎక్కడ కనిపించినా కఠినంగా వ్యవహరిస్తున్నది.

తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దల్ ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, తల్హా ఖాన్ ను అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ కోర్టులో హాజరు పరచనున్నారు. వీరిద్దరూ ఇండోనేషియాలోని జకార్తా నుంచి ముంబైకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. 2023 పుణేలో జరిగిన ఉగ్రదాడిలో వీరు నిందితులుగా ఉన్నట్టు సమాచారం.

మన దేశంలోని స్లీపర్ సెల్స్ సహాయంతో ఉగ్రకుట్రకు తెరలేపినట్టు సమాచారం. వీరి కోసం పోలీసులు చాలా రోజులుగా గాలిస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.