Inostrancevia | డైనోసార్ల కాలంలో భూమిపై నడయాడిన భయానక మృగం.. రూపం చూస్తే గుండె దడ ఖాయం!
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై నడయాడిన డైనోసార్ల సంగతి తెలిసిందే. పెను విపత్తు కారణంగా అవి అంతరించి పోయాయి. కానీ.. ఐదు అడగుల పొడవు ఉండి.. పొడవాటి కత్తుల్లాంటి దంతాలు ఉన్న భయానక మృగాలు కొన్ని ఆ విపత్తుల నుంచి బయటపడ్డాయి.

Inostrancevia | ఈ భూమిపై నడిచిన మాంసాహార జాతుల్లో డైనోసార్‌లు ఒకటి. రెండున్న కోట్ల సంవత్సరాల క్రితం సంభవించిన సామూహిక పెను జీవాంత యుగంలో ఈ జాతులు అంతరించిపోయాయి. కానీ.. అదే కాదు అటువంటి అనేక విపత్తుల నుంచి తప్పించుకుని ఒక మృగ జాతి తదుపరి రెండు లక్షల సంవత్సరాల వరకూ ఈ భూమి మీద తిరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది పెర్మియన్ విలుప్త కాలం. ఆ మృగం పేరు ఇనోస్ట్రాన్సేవియా (Inostrancevia). ఆ కాలంలో అదొక భయానక మృగమని వాటి అస్తికల నిర్మాణాన్ని గమనించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మొత్తం కాలంలో భూమి అనేక మార్పులకు గురైనా.. ఈ మృగం మాత్రం వాటన్నింటినీ తప్పించుకుంది.
సామూహిక జీవ హనన విపత్తులో (The mass extinction) ఈ భూమిపై ఉన్న జీవజాతుల్లో 70 శాతం చనిపోయాయి. నీటిలో ఉండే వాటిలో 90శాతం అంతరించాయి. కానీ.. భారీ కోరలు ఉండే ఇనోస్ట్రాన్సేవియా జాతి మాత్రం ఈ విపత్తు నుంచి తప్పించుకుంది. అందుకోసం ఇది తన స్వస్థలాన్ని వదిలి.. వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత ఈ జీవి ఇప్పటి రష్యా ప్రాంతంలో మాత్రమే జీవించేదని శాస్త్రవేత్తలు భావించారు. అయితే.. పురాజీవ శాస్త్రజ్ఞులు (palaeontologists) మాత్రం అది దక్షిణ అమెరికా వరకూ నడుచుకుంటూ వెళ్లిందని ఆ యా ప్రాంతాల్లో లభించిన శిలాజాల ఆధారంగా గుర్తించారు.
ఇది డైనోసార్ జాతికి చెందిన కానప్పటికీ.. మముత్ జీవులు, డైనోసార్ల కంటే తక్కువేమీ కాదని దాని పదునైన దంతాలు, ప్రత్యేకమైన పుర్రె ఆకృతిని బట్టి నిర్ధారించారు. దీని పొడవు.. ముక్కు నుంచి తోక చివరి వరకూ లెక్కిస్తే సుమారు పది అడుగులు ఉంది. భుజాల వద్ద మూడు అడుగుల ఎత్తుతో ఉండేది. సుమారు 816 కిలోల బరువు ఉంటుంది. దానిలో ప్రత్యేకత అంటే.. దాని దంతాలే. దాదాపు ఐదు అంగుళాల పొడువుతో ఉండే ఈ దంతాలు.. తనకు ఆహారంగా కనిపించిన జీవిని ఒక్క కొరుకుడుతో చీల్చిపారేయగలదు. దీని కాళ్లు కూడా చాలా పొడవు ఉంటాయి. ఆ సమయంలో ఇతర మృగాల కంటే ఇవి పెద్దవి. ఇనోస్ట్రావేన్సియా.. ప్రోటో మమ్మల్స్ లేదా థెరాప్సిడ్స్ జంతువులైన గోర్గొనోప్సియా కుటుంబానికి చెందినది. వాటి లక్షణాలు క్షీరదాలు, సరీసృపాలు.. రెండింటినీ పోలి ఉన్నా.. వాటిలో కొన్ని మాత్రం ఆధునిక క్షీరదాలుగా పరిమాణం చెందాయి.
ఇవి కూడా చదవండి..
Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!