Tongnanlong zhimingi | 92 అడుగుల పొడవున్న భారీ డైనోసార్‌.. చైనాలో వెలుగు చూసిన టోంగ్‌నాన్‌లాంగ్‌ అవశేషాలు

వాస్తవానికి అక్కడి రాతిపొరల్లో టోంగ్‌నాన్‌లాంగ్‌ పూర్తి అస్థిపంజరం లభించలేదు. కానీ.. మూడు వెన్నెముక ఎముకలు, ఆరు తోక వెన్నెముకలు, భుజ భాగం, వెనుక కాళ్ల ఎముకలు, హ్యాండ్‌లింబ్‌ భాగాలు మాత్రమే లభ్యమయ్యాయి. నిజానికి ఈ కొన్ని ఎముకల ఆధారంగా మొత్తం పొడవును అంచనా వేయడం కష్టమే. కానీ.. భుజం ఎముక ఇచ్చిన క్లూ ఆధారంగా దీని పొడవు 75 అడుగల నుంచి 92 అడుగుల వరకూ ఉంటుందని అంచనా వేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tongnanlong zhimingi | 92 అడుగుల పొడవున్న భారీ డైనోసార్‌.. చైనాలో వెలుగు చూసిన టోంగ్‌నాన్‌లాంగ్‌ అవశేషాలు

Tongnanlong zhimingi | డైనోసార్లుగా పిలుచుకుంటున్న అతి భారీ జంతువులు ఈ భూమి మీద ఒకప్పుడు ఎన్నో తిరిగాయి. అనేక దశాబ్దాలుగా వివిధ ప్రాంతాల్లో తవ్వకాల సందర్బంగా వాటి అవశేషాలు అప్పుడప్పుడు బయటపడుతూ ఆశ్చర్యం రేకెత్తిస్తున్నాయి. తాజాగా 92 అడుగుల పొడవైన మహాకాయ డైనోసార్‌ అవశేషాలను పాలియోంటాలజిస్టులు చైనాలో గుర్తించారు. ఇది కోటిన్నర సంవత్సరాల క్రితం జీవించినట్టు భావిస్తున్నారు. ఈ జాతికి Tongnanlong zhimingi అని నామకరణం చేశారు.

ఈ అవశేషాలు సిచువాన్‌ ప్రాంతంలోని సుయినింగ్‌ ఫార్మేషన్‌ రాతిపొరల్లో లభ్యమయ్యాయి. ఇది చోంగ్‌కింగ్‌లోని టోంగ్‌నాన్‌ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం లేట్‌ జురాసిక్‌ కాలానికి సంబంధించినదిగా శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. పొడవైన మెడలు, భారీ కాయాలతో కూడిన డైనోసార్లకు ఇది ఆవాస ప్రాంతంగా ఉండేదని చెబుతున్నారు.

వాస్తవానికి అక్కడి రాతిపొరల్లో టోంగ్‌నాన్‌లాంగ్‌ పూర్తి అస్థిపంజరం లభించలేదు. కానీ.. మూడు వెన్నెముక ఎముకలు, ఆరు తోక వెన్నెముకలు, భుజ భాగం, వెనుక కాళ్ల ఎముకలు, హ్యాండ్‌లింబ్‌ భాగాలు మాత్రమే లభ్యమయ్యాయి. నిజానికి ఈ కొన్ని ఎముకల ఆధారంగా మొత్తం పొడవును అంచనా వేయడం కష్టమే. కానీ.. భుజం ఎముక ఇచ్చిన క్లూ ఆధారంగా దీని పొడవు 75 అడుగల నుంచి 92 అడుగుల వరకూ ఉంటుందని అంచనా వేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.

మమెంచిసౌరిడే జాతికి చెందిన డైనోసార్‌…

చైనాలో లభించిన డైనోసార్‌ అవశేషాలను గమనిస్తే.. అది మమెంచిసౌరిడే (Mamenchisauridae) కుటుంబానికి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెడ అసాధారణ పొడవుతో ఉండటం, భారీ శరీర నిర్మాణం ఈ కుటుంబానికి చెందిన డైనోసార్ల ప్రత్యేకత. ఈ సమూహానికి చెందిన డైనోసార్‌ ముక్కలేవీ ఇంత వరకూ లభించలేదు. ఈ కారణంగానే లభించిన డైనోసార్‌ అవశేషాలను బట్టి దాని మొత్తం పొడవును కచ్చితంగా అంచనా వేయడం కష్టతరంగా ఉంటుంది. అయితే.. మరో పత్రం కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నది. సౌరోపాడ్‌కు సంబంధించి దొరికిన ప్రసిద్ధ మెడ అవశేషాలు అన్నీ అసంపూర్ణంగా ఉండటంతో వాటిని పునర్నిర్మాణం ఒక సవాలుగా మారింది. తాజా డైనోసార్‌ను కనుగొన్న బృందం.. చాకచక్యంగా వ్యవహరించి.. ఆమోదయోగ్యమైన అంచనాలను దృష్టిలో ఉంచుకుని, పొడవుపై ఒక నిర్ధారణకు వచ్చింది.

యూసౌరోపాడ్‌ డైనోసార్ల పరిణామ క్రమంపై తాజాగా బయటపడిన అవశేషాలు కొత్త సమాచారం ఇస్తాయని చైనా జియోలాజికల్‌ సర్వేలోని చెంగ్డు సెంటర్‌కు చెందిన సూయిఫాంగ్‌ వెయి తన పరిశోధన పత్రంలో రాశారు.

ఇప్పటికే ఇదే ప్రాంతంలో Qijianglong guokr అనే మరో పొడవైన మెడతో ఉన్న డైనోసార్‌ శిలాజం కూడా దొరికింది. ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకుంటే.. లేట్‌ జురాసిక్‌ కాలంలో సిచువాన్‌ పరివాహక ప్రాంతం భారీ డైనోసార్లకు ప్రధాన కేంద్రంగా ఉండేదని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు.

ఇవి కూడా చదవండి..

US ready to attack on Iran | ఇరాన్​పై దాడికి అమెరికా సన్నద్ధం? భారీ వైమానిక, నావికా బలగాల మోహరింపు
EPFO | ఈపీఎఫ్‌పై వడ్డీ 8.25% కొనసాగిస్తారా? మార్చి 2న కీలక సమావేశంలో నిర్ణయం
MEGA 158 in Trouble | మెగా158కు అన్నీ అవాంతరాలే : నటీనటుల కోసం బాబీ, నిర్మాత కోసం చిరంజీవి ఎదురుచూపులు