MP డీకే అరుణ ఇంట్లో చొరబడిన దొంగ అరెస్టు

  • By: sr    news    Mar 18, 2025 7:41 PM IST
MP డీకే అరుణ ఇంట్లో చొరబడిన దొంగ అరెస్టు

విధాత: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన పాత నేరస్తుడు అక్రమ్ గా గుర్తించారు. అక్రమ్ ను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను వెల్లడించారు. అరుణ ఇంట్లో చోరీకి వచ్చిన అక్రమ్ గంటన్నర పాటు రెక్కి నిర్వహించాడని తెలిపారు. ఢిల్లీ పోలీసులు తనను పదేపదే అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ కి మకాం మార్చాడని పోలీసులు తెలిపారు.

కేవలం ధనవంతుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసిన అక్రమ్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో రెండు రోజులు రెక్కీ చేశాడని..చివరకు డీకే అరుణ ఇంటి పరిసర ప్రాంతాల్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు. దొంగతనం కోసం డీకే అరుణ ఇంట్లోకి ఈజీగా వెళ్లి రావచ్చని, ఏదైనా తేడా వస్తే పారిపోయేందుకు వెనకాలే రోడ్డు ఉందని గుర్తించిన అక్రమ్ ఆమె ఇంటిని ఎంచుకున్నట్లుగా చెప్పారు.

డబ్బులను మాత్రమే అక్రమ్ దొంగతనం చేస్తుంటాడని..బంగారం విలువైన వస్తువులను అక్రమ ముట్టుకోడని తెలిపారు. వస్తువులను దొంగిలిస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం ఇబ్బంది అన్న ఆలోచనతో అక్రమ్ కేవలం డబ్బు మాత్రమే చోరీ చేస్తుంటాడని తమ విచారణలో తేలిందన్నారు. జల్సా ల కోసమే అక్రమ్ చోరీలకు పాల్పడుతున్నాడని…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని రిమాండ్ చేయనున్నామని తెలిపారు.