ISIS | ఐసిస్ ఆదేశాలతో హైదరాబాద్‌లో బ్లాస్టింగ్‌కు స్కెచ్.. పోలీసుల అదుపులో ఇద్దరు

ISIS | తెలంగాణ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని పలు చోట్ల బ్లాస్టింగ్ చేసేందుకు సౌదీ అరేబియా నుంచి ఐసిస్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టు సమాచారం. విజయనగరానికి చెందిన సిరాజ్.. హైదరాబాద్ కు చెందిన సమీర్ కు పేలుళ్లు జరపాలంటూ ఐసిస్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశాడు. ఇందుకోసం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఏపీ, తెలంగాణ పోలీసులు పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఈ కుట్రను భగ్నం చేశారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతోపాటు కీలక సమాచారాన్ని రాబట్టు తెలుస్తున్నది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.