Jobs: గ్రీస్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.26 లక్షల జీతం,ఉచిత వ‌స‌తి! చివ‌రి తేది ఇదే!

Jobs: గ్రీస్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.26 లక్షల జీతం,ఉచిత వ‌స‌తి! చివ‌రి తేది ఇదే!

విధాత: ఉద్యోగం కావాలనుకునే వారికి గ్రీస్ దేశం పిలుస్తుందని.. ఆ దేశం బాగుందని.. ప్రజలు మంచి వారని ప్ర‌ముఖ‌ యూ ట్యూబర్ చిన్నారావు తెలిపారు. ఏడాదికి రూ.26లక్షల జీతం.. ఫ్రీ అకామిడేషన్.. ఇన్సూరెన్స్ వసతి ఉంటుందని వివరించారు. ఎస్పీఎల్ డాట్ నెట్ లో ఉద్యోగాలను ఆఫర్ చేస్తుందన్నారు. పాస్ పోర్టు, వెళ్లడానికి ఖర్చు పెట్టుకుంటే చాలన్నారు. ఏదో దేశానికి వెళ్లి మోసపోవడం.. అక్కడి పరిస్థితులతో ఇబ్బంది పడటం కంటే గ్రీస్ దేశం బాగానే ఉంటుందన్నారు.

రెండు సంవత్సరాల కాంట్రాక్టు కాలం.. నచ్చితే రెన్యూవల్ చేసుకోవచ్చన్నారు. జూన్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంగ్లీష్ పైన.. .సబ్జెక్టు పైన పట్టుపై స్క్రీనింగ్ ఉంటుందన్నారు. 5సంవత్సరాల అనుభవం.. 35సంవత్సరాలలోపు వయసు.. ఏదేని డిగ్రీ..లేదా అడిగిన స్కిల్ ఉంటే గ్రీస్ డాట్ నెట్, ఎస్ క్యూఎల్..నెట్ డెవలపర్స్ రంగంలోని ఉద్యోగాలలో ప్రయత్నించ వచ్చన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా వెళ్లే అవకాశమున్నందునా.. ఎలాంటి ఆందోళన లేకుండా గ్రీస్ కు ఉద్యోగాల కోసం వెళ్లవచ్చన్నారు. ఇంకా వివరాలు కావాలంటే: 9988853335 కు ఫోన్ చేయండని చిన్నారావు సూచించారు.