Ntr Neel: సంక్రాంతికి.. ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’ ఆప్డేట్

Ntr Neel:
విధాత: జూ.ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ సిద్ధమైంది. దేవర బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ (Ntr) ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ ఇచ్చేందుకు సదరు చిత్ర యూనిట్ రెడీ అయింది.
రానున్న సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా టైటిల్‌ని అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇదిలాఉండగా చాలా రోజుల నుంచి ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు మరో పేరేదైనా పెడుతున్నారా అని చర్చ నడుస్తోంది.
కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించనున్నట్లు, రెగ్యులర్ షూటింగ్ కూడా జనవరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక కథానాయికగా కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్‌ను సెలక్ట్ చేసినట్లు సమాచారం.