మా పార్టీలోకి రా : కవితకు కేఏ పాల్ ఆఫర్
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితకు ప్రజాశాంతి పార్టీలో చేరాలంటూ కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. బీసీల కోసం పోరాడాలంటే తమ పార్టీలో చేరాలని కోరారు.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) మా పార్టీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చారు. నిజంగా కవిత బీసీల గురించి పోరాడాలంటే బీసీల(BC) ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ మాత్రమేనని..మా పార్టీలో చేరి బీజేపీ(BJP) వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలని పాల్ సూచించారు.
బీజేపీ వెలమలు, బ్రహ్మణ పార్టీ అని..కాంగ్రెస్(Congress) రెడ్ల పార్టీగా ఉందన్నారు. మరి ఓ దొరసానిగా నిన్ను ప్రజలు నమ్మాలంటే.. ప్రజల్లో మీపై విశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలని పాల్ కోరారు.
https://youtube.com/shorts/GBofZrIzq8I?feature=share
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram