‘భగవంత్ కేసరి’ సక్సెట్ మీట్‌లో కనిపించని కాజల్..! అసలు కారణం అదేనా..?
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నది. అయితే, ఇటీవల చిత్రం సెలబ్రేషన్ హైదరాబాద్‌లో జరిగాయి. హీరో బాలకృష్ణతో పాటు శ్రీలీలతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. అయితే, ఈ ఈవెంట్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం కనిపించలేదు

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నది. అయితే, ఇటీవల చిత్రం సెలబ్రేషన్ హైదరాబాద్‌లో జరిగాయి. హీరో బాలకృష్ణతో పాటు శ్రీలీలతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. అయితే, ఈ ఈవెంట్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం కనిపించలేదు. సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన పలు ఈవెంట్‌లో మెరిసిన కాజల్ అగర్వాల్.. రిలీజ్ తర్వాత జరిగిన ఈవెంట్లలో మాత్రం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
భగవంత్ కేసరి టీమ్‌పై అసంతృప్తితోనే ప్రమోజన్స్‌కు దూరంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ చిత్రం రూ.125కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం బాలకృష్ణతో పాటు శ్రీశైల ఖాతాలోకి వెళ్లింది. చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేదని.. ఇది తెలిసి కూడా తానే ఈ సినిమా చేస్తానని కాజల్ ముందుకు వచ్చిందని దర్శకుడు ప్రమోషన్స్ సమయంలో వెల్లడించడంతో సైతం కాజల్ అసంతృప్తికా కారణమని ప్రచారం జరుగుతున్నది.

సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్స్‌లో చిత్రబృందం ఎక్కడా కాజల్ పేరును పెద్దగా ప్రస్తావించింది లేదు. యంగ్ హీరోయిన్ శ్రీలీలపై అందరూ పోటీపడి ప్రశంసించడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రేషన్స్‌కు కాజల్ దూరమైందని.. హైదరాబాద్‌లో ఉండి కూడా హాజరుకాలేదని తెలుస్తున్నది. మెగాస్టార్ హీరో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విషయంలోనూ కాజల్‌కు పరాభవం జరిగింది.
సినిమా షూటింగ్ పూర్తయ్యాక కాజల్ సీన్స్‌ను సినిమా నుంచి తొలగించాడు డైరెక్టర్ కొరటాల శివ. తాజాగా భగవంత్ కేసరిలో సీనియర్ హీరో సరసన నటించినా పెద్దగా గుర్తింపు లేకపోవడం మరోసారి కాజల్‌కు నిరాశ కలిగించింది. ప్రస్తుతం కాజల్ తెలుగులో సత్యభామ చిత్రంలో నటిస్తున్నది. ఈ మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ కనిపించనున్నది.