క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ అకాల మృతి

విధాత‌: ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్‌ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన […]

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ అకాల మృతి

విధాత‌: ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

పునీత్‌ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌… 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.