Kavitha : కేసీఆర్ కు ఏఐజీలో జరుగుతున్న చికిత్స ఇదే : కవిత

Kavitha : కేసీఆర్ కు ఏఐజీలో జరుగుతున్న చికిత్స ఇదే : కవిత

Kavitha : ఇటీవల కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కవితను కేసీఆర్ పలుకరించలేదని.. ఆమెతో కనీసం మాట్లాడలేదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా కవిత స్పందించారు. ఇప్పుడు ఆ విషయం అనవసరం అంటూ కొట్టిపారేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాల నుంచి తీసేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక కేటీఆర్ విచారణకు వెళ్తున్నప్పుడు వెళ్లాలో.. వద్దో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

కేసీఆర్ నార్మల్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లారని చెప్పారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న వైద్యం ఇప్పుడు పూర్తి చేయించుకుంటున్నారని చెప్పారు. ఈనెల 17న జాగృతి ఆధ్వర్యంలో మెదక్‌లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం కరెక్ట్ కాదన్నారు.