కోమటి రెడ్డి మంజుల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి మంజుల రాణి ఆకస్మిక మరణం పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
హైదరాబాద్, అక్టోబర్ 22(విధాత): ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి మంజుల రాణి ఆకస్మిక మరణం పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఎల్బీనగర్ లోని వారి నివాసంలో ఆమె భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. లోటస్ ల్యాప్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా,ప్రభుత్వ లెక్చరర్ గా ఆమె సమాజ శ్రేయస్సు కోసం చేసిన సేవలు కొనియాడారు.
ఆమె ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తన సమీప బంధువు కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. కోమటి రెడ్డి మంజుల రాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram